News September 20, 2025
బతుకమ్మ ఏర్పాట్లను ముమ్మరం చేయాలి: కలెక్టర్

బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్ చర్చించారు. వేడుకలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని ఆమె తెలిపారు.
Similar News
News September 20, 2025
అలంపూర్ ఆలయ అర్చకులకు హైకోర్టు ఊరట

జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకుల సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడి పెళ్లిలో వేద ఆశీర్వచనం చేశారని ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈవో అనుమతితోనే తాము పెళ్లికి వెళ్లామని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.
News September 20, 2025
TDPలో చేరిన MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి

MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.
News September 20, 2025
మచిలీపట్నం: పేర్ని నానితోపాటు 400 మందిపై కేసు నమోదు

అనుమతి లేని ఛలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 400 మందిపై మచిలీపట్నం PSలో కేసు నమోదైంది. వీరిలో ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేశ్, దేవభక్తుని చక్రవర్తి, దేవినేని అవినాశ్ ఉన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నిరసన కార్యక్రమం నిర్వహించడంతోపాటు పోలీసులపై దురుసుగా వ్యవహరించారని, ఈ కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.