News September 20, 2025

ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

image

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.

Similar News

News September 20, 2025

గాంధీ మెడికల్ కాలేజీలో రాష్ట్రస్థాయి సదస్సు

image

గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని అలమ్నీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. నేడు, రేపు జరిగే ఈ సదస్సులో ఈఎన్‌టీ నిపుణులు పాల్గొంటారు. ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్స సాంకేతికత, తాజా పరిశోధనలు, నూతన టెక్నాలజీ, అత్యాధునిక వైద్య యంత్రాలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సదస్సు వైద్యులకు ఎంతో ఉపయోగపడనుంది.

News September 20, 2025

25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.

News September 20, 2025

కుప్పం: భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

image

కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.