News September 20, 2025

కామారెడ్డి: ‘దసరా సెలవుల్లో మార్పు చేయాలి’

image

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను మార్పు చేయాలని రాష్ట్ర జూనియర్ లెక్చలర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం పంపించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా సెలవులు జూనియర్ కళాశాలలకు ప్రకటించాలని కోరారు. ముందుగా ప్రకటించిన 28వ తేదీని వెంటనే మార్పు చేయాలన్నారు.

Similar News

News September 20, 2025

HYD: నిమ్స్‌లో రికార్డు స్థాయిలో రోబోటిక్ సర్జరీలు

image

నిమ్స్ ఆసుపత్రి అత్యాధునిక రోబోటిక్ సర్జరీల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 650కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో అత్యధికంగా యూరాలజీ విభాగంలో 370 మందికి చికిత్సలు అందించింది. అలాగే, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ విభాగాల్లోనూ ఈ ఈ సర్జరీలు చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.

News September 20, 2025

పాల్వంచ: కేటీపీఎస్ ఉద్యోగి ఆత్మహత్య

image

పాల్వంచ మండలం ప్రశాంత్‌ కాలనీలో కేటీపీఎస్ ఉద్యోగి ఉప్పెల్లి పాపారావు (35) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపారావు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 20, 2025

VJA: ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు.. సమస్యలేంటో కామెంట్ చేయండి?

image

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. గతేడాది 12 లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకోగా ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఏటా వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అలాగే మీ సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని పబ్లిష్ చేసి ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్తాం.