News September 20, 2025

AI వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలి: MP కావ్య

image

సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ పట్ల బాలికలు జాగ్రత్తలు పాటించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కేయూలో బతుకమ్మ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. విద్యార్థినులు అనుకున్నది సాధించాలంటే క్రమశిక్షణ, కష్టపడి చదవడం అవసరమని ఎంపీ సూచించారు. విద్యార్థినుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Similar News

News September 20, 2025

ఆర్థిక నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి: సీపీ గౌస్ ఆలం

image

ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయాలని సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షర చిట్‌ఫండ్, క్రిప్టో కరెన్సీ కేసులతో సహా అన్ని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు వారి సొమ్ము తిరిగి ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.

News September 20, 2025

H1B వీసా అంటే ఏంటి?

image

అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం <<17767574>>H1B వీసాలను<<>> జారీ చేస్తుంది. విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి. ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 85వేల H1B వీసాలు జారీ చేస్తాయి. వీటి ద్వారా ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందుతున్నారు.

News September 20, 2025

HYD: నిమ్స్‌లో 650కి పైగా రోబోటిక్ సర్జరీలు

image

నిమ్స్ ఆసుపత్రి అత్యాధునిక రోబోటిక్ సర్జరీల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 650కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో అత్యధికంగా యూరాలజీ విభాగంలో 370 మందికి చికిత్సలు అందించింది. అలాగే, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ విభాగాల్లోనూ ఈ ఈ సర్జరీలు చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.