News September 20, 2025

MDK: పాలన వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యం: హ‌రీశ్‌ రావు

image

కాంగ్రెస్ ప్ర‌భుత్వ 22 నెల‌ల పాల‌న‌లో గ్రామీణ వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యమైందని హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను బలంగా చేస్తే, కాంగ్రెస్ కుప్ప కూల్చిందని మండిప‌డ్డారు. గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లకు డిజిల్ పోయించే డబ్బులు లేక మూలన పడేసిన దుస్థితి ఏర్ప‌డింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బతుకమ్మ పండుగ పూట కూడా వీధిదీపాలు వెలగక గ్రామాలు చీకటిలో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

HNK: చావు పిలుస్తోందంటూ సూసైడ్

image

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఐనవోలు మండలం రాంపూర్‌కు చెందిన సురేంద్ర HYD రామాంతపూర్‌‌లో ఉంటున్నారు. తనను చావు పిలుస్తుందంటూ శుక్రవారం బీబీనగర్(భువనగిరి) చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు.

News September 20, 2025

KNR: బతుకమ్మ, దసరా పండుగకు బస్సులు ఏర్పాట్లు

image

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. నేటి నుంచి OCT 1వ తేదీ వరకు JBS నుంచి KNRకు 1321 బస్సులు, OCT 2వ తేదీ నుంచి 13 తేదీ వరకు KNR నుంచి JBSకు 1330 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ కోసం వెబ్సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని సూచించారు.

News September 20, 2025

రియల్ ఎస్టేట్‌తో అన్ని రంగాలు బాగుంటాయి: నారాయణ

image

రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో పాల్గొని నమూనాలను పరిశీలించారు.18 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం తీసుకొచ్చామని మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పేర్కొన్నారు