News September 20, 2025
వరంగల్: సోషల్ మీడియాలో మీ అడ్రస్ పెట్టొద్దు!

సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత అడ్రస్ పెట్టొద్దని, మీ వ్యక్తిగత సమాచారం చాలా కీలకమని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా ప్రొఫైల్‌లో వివరాలు ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని, మీరు ఇచ్చే వివరాలే సైబర్ మోసాలకు దారితీస్తాయన్నారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌కు లాక్ ఉపయోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్టులతో అప్రమత్తం ఉండాలని సూచించారు.
Similar News
News September 20, 2025
ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.
News September 20, 2025
మదనపల్లి: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి

టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లిలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.
News September 20, 2025
మెదక్ పోలీస్ పరేడ్.. అదనపు ఎస్పీ సమీక్ష

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పరేడ్‌కు అదనపు ఎస్పీ మహేందర్ హాజరయ్యారు. పోలీసుల క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, డ్రెస్ కోడ్‌ను ఆయన సమీక్షించారు. పరేడ్‌లు సిబ్బందిలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయని పేర్కొన్నారు.