News September 20, 2025
సంగారెడ్డి: నామినేషన్ల గడవు పొడిగింపు

ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడవును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక నామినేషన్లు సమర్పించిన జిల్లాగా సంగారెడ్డిని నిలిపేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. ఇంకా నామినేషన్లు పంపనివారు ఈ గడువులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 20, 2025
HYD: CMRF మోసం కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. నకిలీ దరఖాస్తులతో రూ. 8.71 లక్షలను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వాన్ని, నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
News September 20, 2025
ADB: తల్లడిల్లుతున్న అన్నదాతల గుండెలు..!

విత్తనాలు వేసినప్పటి నుంచి పంటచేతికొచ్చే దాక పొలాన్ని అన్నదాతలు కన్న బిడ్డల్లా సాకుతారు. కళ్లముందే ఆశలతో సాగు చేసుకున్న పంటంతా ఆగమైతే రైతన్న గుండె తల్లడిల్లుతుంది. ఉమ్మడి ADBలో రైతు ఆత్మహత్యలు కలవర పెడుతున్నాయి. పంటను పందులు నాశనం చేశాయని కెరెమెరిలో ఒకరు, వర్షాలతో పెట్టుబడి రాదని ADB జిల్లాలో ఇద్దరు వారంలోనే ప్రాణాలు వదిలారు. అన్నం పెట్టే రైతన్నలను ఏ సర్కారు ఆదుకోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
News September 20, 2025
మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మాచర్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని, 10:45కి యాదవ్ బజార్‌లో జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో మాట్లాడతారు. 3:35 గంటలకు ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.10 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్తారు.