News September 20, 2025
ములుగు: విధి వింతాట.. సరిహద్దు నుంచి స్వగ్రామానికి..!

దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాస్తున్న ఓ జవాను పండుగకు సెలవులపై ఇంటికి సంతోషంగా వద్దామనుకున్నాడు. తీరా, విధి విషాదం నింపింది. మృతి చెందిన భార్యను కడసారి చూసుకునేందుకు వచ్చేలా చేసింది. ములుగు జిల్లా దేవగిరి పట్నంకు చెందిన ఐటీబీపీ హవల్దార్ శ్రీను భార్య ప్రీతి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో గ్రామానికి వచ్చిన శ్రీను ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
Similar News
News September 20, 2025
డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News September 20, 2025
న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

నాగర్‌కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
News September 20, 2025
నేడు విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు స్పాట్ అడ్మిషన్లు

వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు అడ్మిషన్ల కోసం శనివారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.