News September 20, 2025
బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.
Similar News
News September 20, 2025
ఫీజులు పెండింగ్‌లో ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే: ఉపలోకాయుక్త

AP: వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థుల ఫీజులు పెండింగ్‌లో ఉన్నా ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సిందేనని ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఆదేశించారు. SVUలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విద్యార్థులు నిరసన తెలపగా, సుమోటోగా స్వీకరించారు. ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు. అండర్ టేకింగ్/బాండ్లు తీసుకొని సర్టిఫికెట్లివ్వాలని సూచించారు.
News September 20, 2025
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
News September 20, 2025
న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

నాగర్‌కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.