News September 20, 2025
సంగారెడ్డి: 21 నుంచి దసరా సెలవులు: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 21 నుంచి OCT 3 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించిందని డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. దసరా సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News September 20, 2025
పెగడపల్లి: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

పెగడపల్లి మండలం బతికపల్లిలో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన మన్నె నీరజ ఉదయాన్నే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు తెలిపారు. నీరజ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, అనేక చోట్లకు వెళ్లినా వ్యాధి నయం కాకపోవడంతో అది భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 20, 2025
NGKL: రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న వెలువడిన నోటిఫికేషన్‌కు గాను కోర్టు ఉత్తర్వులకు లోబడి ప్రొవిజినల్ లిస్ట్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రొవిజినల్ లిస్టును జిల్లా వెబ్ సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News September 20, 2025
7 నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు..!

కాకతీయ యూనివర్సిటీ సీబీసీఎస్ఈ బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 7 నుంచి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అసీం ఇక్బాల్ తెలిపారు. అక్టోబరు 7, 9, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.