News September 20, 2025
సంగారెడ్డి: ‘డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు’

డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్ఓ బాల సరోజ, సివిల్ సప్లై డీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
రాష్ట్రంలోనే నల్గొండ టాప్

ఒక్కప్పుడు ఫ్లోరైడ్‌తో గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిన నేల నేడు వరిని పండించడంలో రికార్డు సృష్టిస్తోంది. ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.38 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో నల్గొండ ఫస్ట్ ప్లేస్, 4.66లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. గతేడాది కూడా నల్గొండ జిల్లానే టాప్ లో నిలవడం గమనార్హం. కాగా 4.36 లక్షల ఎకరాలతో నిజామాబాద్ మూడో స్థానంతో ఉంది.
News September 20, 2025
అందంగా ఉందని ఉద్యోగం ఇవ్వట్లేదు!

నైపుణ్యం, అర్హతలున్నా 50 ఇంటర్వ్యూల్లో విఫలమైనట్లు బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల యువతి అలే గౌచా చేసిన పోస్ట్ వైరలవుతోంది. తాను nanny(కేర్ టేకర్) పోస్ట్‌కి అప్లై చేశానని ఆమె పేర్కొంది. అందంతో పాటు ఆకర్షణీయంగా ఉండటంతో ఎవరూ నియమించుకోవట్లేదని వాపోయింది. వివాహేతర సంబంధాలు తలెత్తుతాయని ఇంట్లోని మహిళలు భయపడుతున్నారని ఆమె చెబుతోంది. ఉద్యోగం రాకపోవడంతో కంటెంట్ క్రియేటర్‌గా(అడల్ట్) మారినట్లు ఆమె పేర్కొంది.
News September 20, 2025
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్ హనుమంతరావు

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై ఆయన గూగుల్ మీట్‌లో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల డెవలప్‌మెంట్ ప్లాన్‌లను తయారు చేసి, ఈ-గ్రామ్ స్వరాజ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.