News September 20, 2025
నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

AP: నేడు CM చంద్రబాబు పల్నాడు(D) మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు.
Similar News
News September 20, 2025
SCRలో 14 పోస్టులకు నోటిఫికేషన్

సౌత్ సెంట్రల్ రైల్వే(SCR)లో స్కౌట్స్& గైడ్స్ కోటా కింద 14 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఆయా విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18-33 ఏళ్లలోపు ఉండాలి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి OCT 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, నాందేడ్, గుంటూరు డివిజన్లలో రెండేసి చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్: <
News September 20, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 368 పోస్టులు

RRB 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి <
News September 20, 2025
పాడి పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.