News April 5, 2024
రేవంత్‌రెడ్డినీ అరెస్టు చేస్తారు: ఆప్ ఎంపీ

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన AAP ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి(TG)తో పాటు స్టాలిన్(TN), భగవంత్‌మాన్(PB) వంటి బీజేపీయేతర సీఎంలను కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు. వారందరితో సీఎం పదవులకు రాజీనామా చేయించేందుకు BJP సిద్ధమవుతోందన్నారు. దేశంలో నియంతృత్వం మొదలైందనడానికి ఢిల్లీ, ఝార్ఖండ్ సీఎంలను జైలుకు పంపడమే నిదర్శమని ఆయన అన్నారు.
Similar News
News December 29, 2025
నారా లోకేశ్ లండన్ టూర్ అందుకేనా: YCP

AP: మంత్రి లోకేశ్ లండన్‌లో పర్యటిస్తున్నారంటూ YCP వరుస ట్వీట్‌లతో తీవ్ర విమర్శలు చేసింది. ‘నారా వారి వెన్నుపోటు వారసత్వం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో NTRకు చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించింది. తండ్రిని దింపి గద్దెనెక్కాలనే లోకేశ్ లండన్‌కు వెళ్లారా అని ప్రశ్నించింది. విదేశీ పర్యటన వివరాలను వెల్లడించకపోవడంపై టీడీపీలో గుసగుసలు మొదలయ్యాయంటూ పేర్కొంది.
News December 29, 2025
స్టార్స్‌కి కాదు.. స్టోరీకే ప్రేక్షకుల జై!

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ‘కోర్టు’ మూవీని రూ.5కోట్లతో తీస్తే రూ.55కోట్లు వచ్చాయి. 8 వసంతాలు, మ్యాడ్ స్క్వేర్, అరి మూవీస్ ఆకట్టుకున్నాయి. ఈవారం విడుదలైన శంబాల, దండోరా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. కంటెంట్‌కే ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి రుజువు చేశాయి. 2025లో రిలీజైన సినిమాల్లో మీకు నచ్చినదేంటో కామెంట్ చేయండి.
News December 29, 2025
రైతులు తప్పక పూజించాల్సిన దేవత

ప్రకృతిని భూదేవిగా ఆరాధించడం మన సంస్కృతి. శ్రీ మహావిష్ణువు వరాహ రూపమెత్తినప్పుడు ఆయన శక్తిగా వారాహీ దేవి ఆవిర్భవించింది. ఈమెను సాక్షాత్తు మహాలక్ష్మిగా, లలితా దేవి సైన్యాధ్యక్షురాలిగా పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధిస్తే పంటలు బాగా పండుతాయని పండితులు చెబుతున్నారు. భూ తగాదాలు తొలగి, సంపదలు సిద్ధిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం ఆరంభించే రైతులు ఈమెను పూజించడం వల్ల ఆ పనులలో విజయం లభిస్తుందని నమ్మకం.


