News September 20, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇండ్లు మంజూరు కాగా 7,261 మార్కింగ్ చేయగా 2,569 బేస్మెంట్ స్థాయిలో 428 గోడల స్థాయిలో 165 స్లాబ్ దశలో ఉన్నాయని ఒక ఇల్లు పూర్తయిందనీ అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.
Similar News
News September 20, 2025
వేములవాడ: ‘ప్రతి మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలి’

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం చీర్లవంచ, RR కాలనీలోని ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మహిళలకు వైద్య పరీక్షలు ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. జిల్లాలోని అన్ని PHC, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, బస్తీ దవఖానాలు, మొత్తం 82 ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేస్తారని ఆయన వివరించారు.
News September 20, 2025
ఆదిలాబాద్: గంజాయి ‘మత్తు’ వదలరా

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు ఘటనలు తరచుగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గుడిహత్నూర్ మండలంలో పోలీసులు వందలాది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదు చేసినప్పటికీ, కొందరు డబ్బుకు ఆశపడి గంజాయి సాగు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గంజాయికి దూరంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
News September 20, 2025
NCRB డిప్యూటీ డైరెక్టర్‌గా రెమా రాజేశ్వరి

డీఐజీ రెమా రాజేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమెను నియమించనున్నారు. రాజేశ్వరి 2009 బ్యాచ్ IPS అధికారిణి, ప్రస్తుతం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా ఉన్నారు. 2021లో ‘సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ గా ‘ఫోర్బ్స్’ ప్రచురించింది. గృహహింస, ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా రాజేశ్వరి పలు కార్యక్రమాలు చేపట్టారు. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ ఎస్పీగా పనిచేశారు.