News September 20, 2025
సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలి: ఎస్పీ

ఇల్లందు డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా ప్రతి ఏరియాలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన ప్రజలు పడకుండా నిత్యం అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు ఉన్నారు.
Similar News
News September 20, 2025
NCRB డిప్యూటీ డైరెక్టర్‌గా రెమా రాజేశ్వరి

డీఐజీ రెమా రాజేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమెను నియమించనున్నారు. రాజేశ్వరి 2009 బ్యాచ్ IPS అధికారిణి, ప్రస్తుతం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా ఉన్నారు. 2021లో ‘సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ గా ‘ఫోర్బ్స్’ ప్రచురించింది. గృహహింస, ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా రాజేశ్వరి పలు కార్యక్రమాలు చేపట్టారు. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ ఎస్పీగా పనిచేశారు.
News September 20, 2025
HYD: మీరు స్పాన్సర్ చేస్తే.. వారికి FREE టూర్

ఆర్టీసీ యాత్రాదానం పథకంలో 500 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ రాజధాని బస్సుల్లో రూ.26,707 నుంచి రూ.50,963 వరకు స్పాన్సర్‌షిప్ ఉంటుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, NRI, NGO, విద్యాసంస్థలు, సంఘాలు, కుటుంబాలు వృద్ధులు, అనాధల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు.
News September 20, 2025
కేయూ: 15 వరకు డిగ్రీ సెమిస్టర్ ఫీజుల చెల్లింపు

కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఇతర కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫీజులను అక్టోబరు 15 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో అక్టోబరు 22 వరకు ఫీజులు చెల్లించుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు కేయూ వెబ్సైట్‌లో చూడాలని సూచించారు.