News September 20, 2025
అలంపూర్ ఆలయ అర్చకులకు హైకోర్టు ఊరట

జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకుల సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడి పెళ్లిలో వేద ఆశీర్వచనం చేశారని ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈవో అనుమతితోనే తాము పెళ్లికి వెళ్లామని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది.
Similar News
News September 20, 2025
రేపటి నుంచి దసరా సెలవులు

TG: గురుకులాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి. అటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు హాలిడేస్ ప్రకటించారు. మరోవైపు గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలకు మాత్రం వారం రోజులు ఆలస్యంగా సెలవులు ఇచ్చారని, వాటికి కూడా రేపటి నుంచే సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News September 20, 2025
భూపాలపల్లి: తేనెటీగల పెంపక రైతులకు సబ్సిడీ

తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ద్వారా ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం కింద తేనెటీగల పెంపకం చేపట్టే వారికి 40% నుంచి 60% వరకు సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. ఈ పథకంలో చేరడానికి ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించాలని కోరారు.
News September 20, 2025
ఏ రోజున ఏ బతుకమ్మ అంటే?

సెప్టెంబర్ 21 – ఎంగిలి పూల బతుకమ్మ
సెప్టెంబర్ 22 – అటుకుల బతుకమ్మ
సెప్టెంబర్ 23 – ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబర్ 24 – నానే బియ్యం బతుకమ్మ
సెప్టెంబర్ 25 – అట్ల బతుకమ్మ
సెప్టెంబర్ 26 – అలిగిన బతుకమ్మ
సెప్టెంబర్ 27 – వేపకాయల బతుకమ్మ
సెప్టెంబర్ 28 – వెన్నెముద్దల బతుకమ్మ
సెప్టెంబర్ 29, 30(తిథి ఆధారంగా) – సద్దుల బతుకమ్మ