News September 20, 2025

రాజమండ్రి: కలెక్టర్‌ను కలిసిన ప్రధానోపాధ్యాయులు

image

తూ.గో జిల్లా నూతన కలెక్టర్‌ చేకూరి కీర్తిని జిల్లా హెచ్ఎం సంఘం శుక్రవారం కలెక్టరేట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పూర్వ తూ.గో జిల్లాలో జేసీగా పనిచేసిన కాలంలో పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి గురించి ఆమె హెచ్ఎంలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ జిల్లా ఛైర్మన్ కాంతి ప్రసాద్, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాయ అధ్యక్షుడు కోలా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణారావు పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది: డీఈవో

image

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తూ.గో జిల్లా డీఈవో కంది వాసు దేవరావు అన్నారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో జరిగిన పాఠశాల క్రీడోత్సవాల సందర్భంగా అండర్-14, అండర్-17 బాక్సింగ్ బాలబాలికల ఎంపిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లా తరపున పాల్గొనే క్రీడాకారులు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

News September 20, 2025

రాజమండ్రి: ‘సాధారణ జ్వరాలు మాత్రమే..  ఆందోళన వద్దు’

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News September 19, 2025