News September 20, 2025
గాంధీ మెడికల్ కాలేజీలో రాష్ట్రస్థాయి సదస్సు

గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని అలమ్నీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో చెవి, ముక్కు, గొంతు వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. నేడు, రేపు జరిగే ఈ సదస్సులో ఈఎన్‌టీ నిపుణులు పాల్గొంటారు. ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్స సాంకేతికత, తాజా పరిశోధనలు, నూతన టెక్నాలజీ, అత్యాధునిక వైద్య యంత్రాలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సదస్సు వైద్యులకు ఎంతో ఉపయోగపడనుంది.
Similar News
News September 20, 2025
HYD: చావు పిలుస్తోందంటూ సూసైడ్

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. HYD రామాంతపూర్‌కు చెందిన సురేంద్ర తనను చావు పిలుస్తుందంటూ బీబీనగర్ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ‘అమ్మా నువ్వు చనిపోవద్దు’ అంటూ కొడుకు ఏడుపులు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
News September 20, 2025
HYD: CMRF మోసం కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. నకిలీ దరఖాస్తులతో రూ. 8.71 లక్షలను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వాన్ని, నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
News September 20, 2025
HYD: ట్రేడింగ్ మోసం.. ఇద్దరి అరెస్ట్

నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇనమ్దార్ వినాయక రాజేంద్ర(నిఖిల్), రిషి తుషార్ అరోతే(విక్రంథ్)ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా లింకులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా బాధితులను ప్రలోభపెట్టి రూ. 32 లక్షల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులపై రాష్ట్రంలో 2 కేసులు, దేశవ్యాప్తంగా 12 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్స్, బైనాన్స్ ట్రాన్సాక్షన్ వివరాలు సీజ్ చేశారు.