News September 20, 2025

అక్టోబర్ 7న దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీ: డీఈఓ

image

రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశాల మేరకు అక్టోబర్ 7న జేపీఎస్‌ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలు-2025 నిర్వహిస్తున్నట్లు డీఈఓ దీపక్ తివారి తెలిపారు. మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ & టెక్నాలజీ అనే ప్రధాన అంశంతో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ‘విజ్ఞానంలో మహిళలు’, ‘స్మార్ట్ వ్యవసాయం’, ‘అందరికీ ఆరోగ్యం’, ‘గ్రీన్ టెక్నాలజీస్’ వంటి అంశాలు ఇందులో ఉంటాయని వివరించారు.

Similar News

News September 20, 2025

ఏయూలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో MA, Mcom, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకుడు డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 26వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పీజీ సెట్‌లో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీజులు, కోర్సులు, తదితర వివరాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

News September 20, 2025

VZM: ‘గంజాయిపై ఉక్కుపాదం మోపాం’

image

అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాల్లోను అగ్రగామిగా నిలిపామని విజయనగరం పూర్వ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్‌లో శనివారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడం వలనే ఇది సాధ్యమైందన్నారు.

News September 20, 2025

విజయవాడలో కొత్త రూపంలో డ్రగ్స్

image

విజయవాడలో కొత్తరకం డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మెడికల్ షాపులో టాబ్లెట్స్‌లా గంజాయి టాబ్లెట్ల ఫోటోలు బయటకు రావడం హల్చల్‌గా మారింది. నగరంలో మూడు, నాలుగు బస్తాలకు పైగా ఇలాంటి డ్రగ్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది. మాచవరం పరిధిలో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం. దసరా ఉత్సవాలపై పోలీసుల దృష్టి ఉండడంతో డ్రగ్స్ సప్లై చేసే ముఠా సభ్యులు చెలరేగిపోతున్నారు.