News September 20, 2025
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు: RTC

పండగ సందర్భంగా బస్సు టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. సాధారణ సర్వీసులకు ధరలు యథాతథంగా ఉన్నాయని తెలిపింది. పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు మాత్రమే జీవో 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసుల డీజిల్ ఖర్చులను భర్తీ చేసేందుకు టికెట్ ధరలను స్వల్పంగా సవరిస్తామని పేర్కొంది. ఈ విషయంలో ప్రచారాలను నమ్మవద్దని RTC కోరింది.
Similar News
News September 20, 2025
HYD: సూపర్ మార్కెట్లకు జీహెచ్ఎంసీ నోటీసులు

గ్రేటర్ పరిధిలో 44 సూపర్ మార్కెట్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధికారులు తనిఖీలు చేశారు. 58 శాంపిల్స్ సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ లాబరేటరీకి పంపించారు. నిబంధనలను ఉల్లంఘించిన సూపర్ మార్కెట్లకు నోటీసులు జారీ చేశారు. తేదీ గడిచిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 20, 2025
HYD: చావు పిలుస్తోందంటూ సూసైడ్

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. HYD రామాంతపూర్‌కు చెందిన సురేంద్ర తనను చావు పిలుస్తుందంటూ బీబీనగర్ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ‘అమ్మా నువ్వు చనిపోవద్దు’ అంటూ కొడుకు ఏడుపులు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
News September 20, 2025
HYD: CMRF మోసం కేసులో ఏడుగురు అరెస్ట్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. నకిలీ దరఖాస్తులతో రూ. 8.71 లక్షలను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వాన్ని, నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.