News April 5, 2024
దూరదర్శన్‌లో మూవీ ప్రసారం.. సీఎం అభ్యంతరం

కేంద్ర ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్(DD)పై కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడం సరికాదన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మత ఘర్షణలకు దారితీస్తుందని Xలో పోస్ట్ చేశారు. BJP, ఆరెస్సెస్‌కు ప్రచార యంత్రంగా DD మారొద్దంటూ హితవు పలికారు. మరోవైపు శుక్రవారం ఈ మూవీని ప్రసారం చేసేందుకు డీడీ సిద్ధమైంది.
Similar News
News September 17, 2025
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: ఇవాళ CM చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో OCT 2వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. మ.3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. తర్వాత VJA బయల్దేరతారు.
News September 17, 2025
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.
News September 17, 2025
US జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాకిస్థాన్

OP సిందూర్ నిలిపివేయడం వెనుక అమెరికా హస్తంలేదని తాజాగా పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. ‘మేము US విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో తృతీయ పక్షం జోక్యం గురించి చెప్పాం. బయటి వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవట్లేదని ఆయన మాతో చెప్పారు. వాష్గింగ్టన్‌లో మళ్లీ నేను అదే ప్రస్తావించాను. ఇది పూర్తిగా ద్వైపాక్షికంగానే పరిష్కారమవ్వాలని ఇండియా తెగేసి చెప్పినట్లు బదులిచ్చారు’ అని తెలిపారు.