News September 20, 2025

ఆసియా కప్: సూపర్-4లో భారత్ షెడ్యూల్ ఇదే

image

ఆసియా కప్‌లో ఇవాళ్టి నుంచి సూపర్-4 సమరం మొదలవనుంది. ఈరోజు తొలి మ్యాచులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రేపు ఇండియా, పాక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. 23న SLvsPAK, 24న INDvsBAN, 25న BANvsPAK, 26న INDvsSL మ్యాచులు జరగనున్నాయి. అన్ని మ్యాచులు రా.8 గంటలకు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఈ నెల 28న ఫైనల్ ఆడతాయి.

Similar News

News September 20, 2025

మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

image

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.

News September 20, 2025

ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

image

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.

News September 20, 2025

పసుపు పంటలో నత్రజని లోపం-లక్షణాలు

image

పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం, భూమిలో క్షార, చౌడు గుణం కలిగి ఉండటం.. సమతుల, సమగ్ర ఎరువులు వాడకపోవడం పసుపు పంటలో నత్రజని లోపానికి ప్రధాన కారణం. దీని వల్ల ఆకులు పాలిపోయి ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవ్వడం, ఆకులు కొన నుంచి మధ్య వరకు మాడిపోవడం జరుగుతుంది. ఈ లోపం వల్ల కొమ్మల్లో పచ్చదనం తగ్గి ముదురు ఆకులు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.