News September 20, 2025
VJA: ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు.. సమస్యలేంటో కామెంట్ చేయండి?

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. గతేడాది 12 లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకోగా ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఏటా వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అలాగే మీ సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని పబ్లిష్ చేసి ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్తాం.
Similar News
News September 20, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: పెమ్మసాని

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన ‘నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్-2025’లో ఆయన పాల్గొన్నారు. రోగనిర్ధారణ ఆలస్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. వైద్య సేవల్లోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
News September 20, 2025
ఎర్లీ మెనోపాజ్‌లో ఏం తినాలంటే..

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.
News September 20, 2025
పసుపు పంటలో నత్రజని లోపం-లక్షణాలు

పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం, భూమిలో క్షార, చౌడు గుణం కలిగి ఉండటం.. సమతుల, సమగ్ర ఎరువులు వాడకపోవడం పసుపు పంటలో నత్రజని లోపానికి ప్రధాన కారణం. దీని వల్ల ఆకులు పాలిపోయి ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవ్వడం, ఆకులు కొన నుంచి మధ్య వరకు మాడిపోవడం జరుగుతుంది. ఈ లోపం వల్ల కొమ్మల్లో పచ్చదనం తగ్గి ముదురు ఆకులు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.