News September 20, 2025
రియల్ ఎస్టేట్‌తో అన్ని రంగాలు బాగుంటాయి: నారాయణ

రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో పాల్గొని నమూనాలను పరిశీలించారు.18 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం తీసుకొచ్చామని మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పేర్కొన్నారు
Similar News
News September 20, 2025
ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.
News September 20, 2025
మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.
News September 20, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: పెమ్మసాని

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన ‘నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్-2025’లో ఆయన పాల్గొన్నారు. రోగనిర్ధారణ ఆలస్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. వైద్య సేవల్లోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.