News September 20, 2025

HYD: ట్రేడింగ్ మోసం.. ఇద్దరి అరెస్ట్

image

నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇనమ్దార్ వినాయక రాజేంద్ర(నిఖిల్), రిషి తుషార్ అరోతే(విక్రంథ్)ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా లింకులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా బాధితులను ప్రలోభపెట్టి రూ. 32 లక్షల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులపై రాష్ట్రంలో 2 కేసులు, దేశవ్యాప్తంగా 12 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్స్, బైనాన్స్ ట్రాన్సాక్షన్ వివరాలు సీజ్ చేశారు.

Similar News

News September 20, 2025

BREAKING: HYD: విషాదం.. ఇద్దరు యువకులు మృతి

image

HYD బొల్లారంలో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News September 20, 2025

HYD: డాక్టర్ ఏఎస్ రావు చరిత్ర ఇదే.!

image

HYD భారత అణు శాస్త్రవేత్త, ECIL వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.ఎస్.రావు జయంతి నేడు. 1967లో హైదరాబాద్‌లో ECILను స్థాపించి, దేశానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్, రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన దూరదృష్టితోనే ఈసీఐఎల్ ‘భారత ఎలక్ట్రానిక్స్ విప్లవానికి పితామహుడు’గా గుర్తింపు పొందాడు.

News September 20, 2025

HYD: సూపర్ మార్కెట్లకు జీహెచ్ఎంసీ నోటీసులు

image

గ్రేటర్ పరిధిలో 44 సూపర్ మార్కెట్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధికారులు తనిఖీలు చేశారు. 58 శాంపిల్స్ సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ లాబరేటరీకి పంపించారు. నిబంధనలను ఉల్లంఘించిన సూపర్ మార్కెట్లకు నోటీసులు జారీ చేశారు. తేదీ గడిచిన పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.