News April 5, 2024

జనగామ: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తి పై కేసు

image

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI రాజు తెలిపారు. లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో కలిసి ఉంటున్నారు. ఆమెను మోసగించి ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 10, 2025

ఫేక్ మెసేజ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు. లింక్‌ క్లిక్ చేసి చెక్ చేసుకోండి’ అంటూ వాట్సాప్‌ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మొద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఫేస్‌బుక్‌లో అధికారిక పేజీ ద్వారా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News September 9, 2025

వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News September 8, 2025

వరంగల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతుల స్వీకరణ

image

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతులను కలెక్టర్‌కు నేరుగా అందజేశారు. డాక్టర్ సత్య శారద ప్రతి వినతిని ఓర్పుతో స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు చేశారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్పష్టం చేశారు.