News September 20, 2025

నాయుడుపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాయుడుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్లిపేడు పంచాయతీకి చెందిన శివయ్య(34) ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాములో పనిచేస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 20, 2025

సమయం వచ్చింది.. దేశాభివృద్ధికి ప్రతిభను వాడుదాం!

image

ట్రంప్ నిర్ణయాల వేళ మన ప్రతిభతో ఇండియాను అభివృద్ధి చేసుకోవాలనే చర్చ మొదలైంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతక్కుండా మన దగ్గరే ప్రతిభను ఉపయోగించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లు, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రతి సవాలును అవకాశంగా మలుచుకొని దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే సత్తా మన యువతకు ఉందంటున్నారు.

News September 20, 2025

కొడంగల్‌లో 15వేల ఓట్ల చోరీ: CM రేవంత్

image

కొడంగల్ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్లు చోరీ చేసినట్లు CM రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పోలింగ్ బూతులో 5 నుంచి 10 శాతం ఓట్లు తొలగించారని తెలిపారు. ఓట్ల చోరీపై నిరసన కూడా వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 9,319 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

News September 20, 2025

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. భక్తుల విన్నపాలు ఇవే

image

➣దూర ప్రాంతాల భక్తులకు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. లాకర్ సౌకర్యం కల్పించాలి.
➣ప్రసాదాల వద్ద సరిపడా చిల్లర తెచ్చుకోవాలనడంతో ఇబ్బంది. డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించాలి.
➣కేశఖండన శాలల వద్ద డబ్బులు వసూళ్లపై నియంత్రణ.
➣వాష్ రూమ్స్ సరైన మెయింటెన్స్ లేకపోవడం
➣క్యూలైన్లో మజ్జిగ, బిస్కెట్స్ లాంటివి అందించడం
➣మాలలు అమ్మవారి గుడిలోనే తీసేలా చర్యలు