News September 20, 2025

J&Kలో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్‌లో టెర్రరిస్టులు!

image

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ జవానుకు గాయాలు కాగా 3-4 మంది టెర్రరిస్టులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ నిన్న రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.

Similar News

News September 20, 2025

దీపిక పోస్ట్.. ‘కల్కి’ని ఉద్దేశించేనా?

image

‘కల్కి’ నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకొణే ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ‘ఓంశాంతి ఓం’ సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తుచేసుకున్నారు. ‘ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికీ అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో’ అని రాసుకొచ్చారు.

News September 20, 2025

కాసేపట్లో వర్షం..

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. అటు హైదరాబాద్‌లో రాత్రి సమయంలో వర్షం పడుతుందని పేర్కొన్నారు.

News September 20, 2025

గ్రామాల్లో వృద్ధులపైనే వ్యవసాయ భారం

image

వ్యవసాయానికి గ్రామాలే వెన్నెముక. ఇక్కడ పండే పంటలే మిగిలిన ప్రాంతాలకు ఆధారం. నేటి యువత వ్యవసాయాన్ని విస్మరించి, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో నేడు వ్యవసాయం, పశుపోషణాభారం వృద్ధులపైనే పడుతోంది. ప్రస్తుతం గ్రామాల్లోని వృద్ధులు.. రైతులుగా, పశుపోషకులుగా, వ్యవసాయ కూలీలుగా, కుటుంబ సంరక్షులుగా, అనేక ఉత్పాదక పనులు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.