News September 20, 2025
నేడు విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు స్పాట్ అడ్మిషన్లు

వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు అడ్మిషన్ల కోసం శనివారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
Similar News
News September 20, 2025
HYD: డాక్టర్ ఏఎస్ రావు చరిత్ర ఇదే.!

HYD భారత అణు శాస్త్రవేత్త, ECIL వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.ఎస్.రావు జయంతి నేడు. 1967లో హైదరాబాద్‌లో ECILను స్థాపించి, దేశానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్, రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన దూరదృష్టితోనే ఈసీఐఎల్ ‘భారత ఎలక్ట్రానిక్స్ విప్లవానికి పితామహుడు’గా గుర్తింపు పొందాడు.
News September 20, 2025
భారీ వర్షాలు.. అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం రాయచోటి కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం వల్ల పొంగి ఉన్న వాగులు, వంకల దగ్గరికి ప్రజలు పోకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 20, 2025
గద్వాల్: ప్రోటోకాల్ పాటించని అధికారి సస్పెండ్

ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని రసాభాస జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ పాటించలేదని జిల్లా అదనపు కలెక్టర్ సిసి రాఘవేంద్ర గౌడ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు.