News September 20, 2025
హనుమకొండ కలెక్టరేట్‌లో లైంగిక వేధింపుల కలకలం..!

హనుమకొండ కలెక్టరేట్‌లోని ఓ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని అదే సెక్షన్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే బదిలీ చేశారట.
Similar News
News September 20, 2025
ఖమ్మం: మైనారిటీ మహిళలకు 2 కొత్త పథకాలు

మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని జిల్లా సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా పథకాలకు మైనారిటీ, దూదేకుల, ఫకీర్లు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. అక్టోబర్ 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఇతర వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 20, 2025
వనపర్తి: పోలీసు శాఖలో హోంగార్డ్స్ అంతర్భాగం: ఎస్పీ

హోంగార్డ్స్ పోలీసు శాఖలో అంతర్భాగమని, పోలీసులతో పాటు వారు నిరంతరం సేవలందిస్తున్నారని ఎస్పీ గిరిధర్ అన్నారు. వర్షాకాలంలో, చలికాలంలో విధుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హోంగార్డ్స్‌కు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు అందజేశారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సేవలను ఆయన కొనియాడారు.
News September 20, 2025
కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగులకు దసరా అడ్వాన్స్

సింగరేణి సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. అర్హులైన రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 ఖాతాలో జయ చేయనున్నారు. ఈనెల 23న బ్యాంకు జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా అడ్వాన్స్‌ను పది వాయిదాలలో తిరిగి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.