News April 5, 2024
జామిలో వ్యక్తి సూసైడ్

జామి మం. బలరాంపురానికి చెందిన వి అప్పారావు (52) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి తాగేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.
Similar News
News April 19, 2025
పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.
News April 19, 2025
బొత్స వ్యూహాలు ఫలించేనా

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?
News April 18, 2025
బొబ్బిలిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

బొబ్బిలిలోని శ్రీవెంకటకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న షాపింగ్ కంప్లెక్స్‌లో విద్యార్థి JAC ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. వేసవి సెలవులలో విద్యార్థులకు JAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బి.సాయి కిరణ్ చెప్పారు. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, DTP, C, C ప్లస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.