News September 20, 2025
తణుకు: వ్యక్తిని నిర్బంధించి గాయపరిచి దోపిడీ

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భందించి తీవ్రంగా గాయపరిచి రూ.లక్ష నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం తెల్లవారుజామున తణుకులో చోటుచేసుకుంది. తణుకు సజ్జాపురంలో జుపిటర్ ట్రేడర్స్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ముత్యాల వెంకటరావుపై గుర్తుతెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును దోచుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 20, 2025
వృద్దురాలిపై దాడి.. బంగారం అపహరణ

మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఒంటరిగా ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి రాజేశ్వరి (55)పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. శనివారం జరిగిన ఈ ఘటనలో దుండగుడు ఆమె తలపై కర్రతో కొట్టగా స్పృహ కోల్పోయింది. తర్వాత గొలుసు తెంపుకొని పారిపోయాడు. రాజేశ్వరి నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 20, 2025
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ ఏకైక కుమారుడు డా.అంజన్(55) గుండె పోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు ఇంటి వద్ద గుండె పోటు రాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంజన్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. నాయకులు, ప్రజలు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
News September 20, 2025
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోగా అమలు చేయాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.