News September 20, 2025
వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దతు ధర(దూది పింజ పత్తికి క్వింటాకు ₹8,110, తక్కువ దూది పింజ ఉంటే ₹7,710) లభించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించాలన్నారు.
Similar News
News September 20, 2025
చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా: CBN

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలకులు విధించిన చెత్త పన్ను తొలగించామని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకున్నామని CM చంద్రబాబు అన్నారు. మాచర్లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. ‘గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా. మన పరిసరాల్లోని చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా’ అని చంద్రబాబు తెలిపారు.
News September 20, 2025
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. జగన్ కామెంట్స్ వైరల్

AP: ఇటీవల జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి రావట్లేదని స్పీకర్ అనర్హత వేటు వేస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలందరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని జగన్ చెప్పినట్లు సమాచారం. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని చెప్పలేదని, మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని జగన్ తెలిపారు.
News September 20, 2025
దీపిక పోస్ట్.. ‘కల్కి’ని ఉద్దేశించేనా?

‘కల్కి’ నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకొణే ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ‘ఓంశాంతి ఓం’ సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తుచేసుకున్నారు. ‘ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికీ అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో’ అని రాసుకొచ్చారు.