News September 20, 2025
ఖమ్మం రీజియన్‌లో ఉద్యోగులకు బదిలీలు

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ ఉద్యోగులను బదిలీ చేస్తు RM సరిరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్‌లకు పదోన్నతులతో పాటు వారు కోరుకున్న చోటుకు బదిలీలు కల్పించారు. RMగా సరిరామ్ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోనే రెండవసారి పదోన్నతులు, బదిలీలు చేపట్టడం ద్వారా జిల్లాలోని ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 20, 2025
GST ఎఫెక్ట్.. సిలిండర్ ధర తగ్గుతుందా?

ఈనెల 22 నుంచి GST కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే నిత్యం వాడే వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గుతుందా అనే సందేహం సామాన్యుల్లో నెలకొంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5%, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST అమల్లో ఉంది. ఇకపైనా ఇదే కొనసాగనుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.905 ఉంది.
News September 20, 2025
సిరిసిల్ల కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం?

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రొటోకాల్ విస్మరించడం పట్ల చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్‌తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై రేవంత్ సీరియస్‌గా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.
News September 20, 2025
BREAKING: HYD: విషాదం.. ఇద్దరు యువకులు మృతి

HYD బొల్లారంలో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.