News September 20, 2025

NLG: పండుగల వేళ.. ధరల షాక్

image

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.

Similar News

News September 20, 2025

NLG: దరఖాస్తుల ఆహ్వానం.. ఈనెల 30 లాస్ట్

image

2025-26 ఆర్ధిక సంవత్సరమునకు గాను స్వచ్చంద సంస్థలు/ ప్రభుత్వేతర సంస్థలు.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు మొదలగు సంస్థలలకు ఆర్థిక సహాయం అందించుటకు గాను అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లా పరిధిలోని, రిజిస్టర్డ్ స్వచ్చంద సంస్థలు/ప్రభుత్వేతర సంస్థలు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

NLG: లైంగిక వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశం

image

నల్గొండ డైట్‌లో చోటు చేసుకున్న విద్యార్థినికి లైంగిక వేధింపుల ఘటనపై DEO బొల్లారం బిక్షపతి విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎంఈఓ అరుంధతితోపాటు డైట్ ప్రిన్సిపల్ నరసింహను విచారణ అధికారులుగా నియమించామని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని.. విద్యార్థినికి న్యాయం చేస్తామని DEO తెలిపారు. విచారణ కమిటీలో అరుంధతిని తొలగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News September 20, 2025

గట్టుప్పల్: చేనేత కార్మికురాలి ఆత్మహత్య

image

అప్పుల బాధలు తట్టుకోలేక గట్టుప్పల్‌కు చెందిన చేనేత కార్మికురాలు అప్పం యాదమ్మ (50) ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమె, బాత్రూంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.