News September 20, 2025

కడప: అసిస్టెంట్ ప్రొఫెసర్ పై కేసు నమోదు

image

రిమ్స్ దంత వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చక్రపాణిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్ పోలీసులు శనివారం తెలిపారు. ఈయన కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తుండేవాడు. ఈయన చేష్టలు భరించలేని కొందరు విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్ విద్యార్థులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

కడప: 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ SP శ్రీనివాస్ వివరాల మేరకు.. కడప(D) ప్రొద్దుటూరు-జమ్మలమడుగు దారిలో వాహనాల తనిఖీ చేపట్టగా పెద్దశెట్టిపల్లి వద్ద కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది చుట్టుముట్టి నిందితులు, 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 20, 2025

పొద్దుటూరులో వడ్డీ వ్యాపారి కిడ్నాప్

image

పొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాల రెడ్డి కిడ్నాప్ అయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం సమీపంలో వేణుగోపాల్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అరుణ్ రెడ్డి కేసు నమోదు చేశామన్నారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News September 19, 2025

ఉల్లి మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం: కలెక్టర్

image

జిల్లాలో ఉల్లి సాగుచేసిన రైతులకు నష్టం కలగకుండా మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జేసీ అతిథి సింగ్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఉల్లి నిల్వలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెఫెడ్ అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు. రైతుల నుంచి లాభం ఆశించవద్దని వర్తకులకు సూచించారు.