News September 20, 2025

7 నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు..!

image

కాకతీయ యూనివర్సిటీ సీబీసీఎస్ఈ బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 7 నుంచి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అసీం ఇక్బాల్ తెలిపారు. అక్టోబరు 7, 9, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

Similar News

News September 20, 2025

వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్

image

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్‌తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.

News September 20, 2025

HYD: కేబీఆర్ పార్కులో రేపు కుక్క పిల్లలను ఇస్తారు..!

image

రేపు KBR పార్కులో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ మేళా జరగనున్న నేపథ్యంలో GHMC అధికారులు కుక్క పిల్లల ప్రేమికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్కు వద్దకు వచ్చి దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. అభిమానులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News September 20, 2025

RITESలో 27 పోస్టులు

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(<>RITES<<>>) 27 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 8 వరకు అప్లై చేసుకోవచ్చు. QA/QC ఎక్స్‌పర్ట్, మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.