News September 20, 2025
పెగడపల్లి: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

పెగడపల్లి మండలం బతికపల్లిలో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన మన్నె నీరజ ఉదయాన్నే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు తెలిపారు. నీరజ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, అనేక చోట్లకు వెళ్లినా వ్యాధి నయం కాకపోవడంతో అది భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 20, 2025
రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.
News September 20, 2025
వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎం&హెచ్ఓ

కలరా వంటి జలమూల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జీవనరాణి శనివారం సూచించారు. విరేచనాలు, వాంతులు, శరీర నిస్సత్తువ, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు గమనించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని, కాబట్టి మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
News September 20, 2025
HYD: అన్ని డిపోల నుంచి వారికి స్పెషల్ బస్సులు..!

యాత్రాదానం గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ ప్రోగ్రాంలో భాగంగా HYD, ఉమ్మడి RR అన్ని డిపోల నుంచి అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, వరంగల్, కాళేశ్వరం, అనంతగిరి, కొమురవెల్లి, ద్వారకాతిరుమల, అన్నవరం, వేములవాడ వంటి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రాలకు బస్సులను ఏర్పాటు చేస్తామని రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విరాళాల ద్వారా వృద్ధులు, అనాథల కోసం ప్రత్యేకంగా యాత్ర స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.