News September 20, 2025

చిత్తూరు: సర్పంచులకు గౌరవ వేతనం విడుదల

image

చిత్తూరు జిల్లాలో సర్పంచులకు రూ.49,69,138 గౌరవ వేతనం విడుదలైందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. ఎన్నికలు జరిగిన 684 పంచాయతీల్లోని సర్పంచులకు రెండో విడత కింద ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఒక్కొక్క సర్పంచుకు గౌరవ వేతనంగా రూ.3 వేలు వంతున విడుదల కాగా వాటిని బ్యాంకు ఖాతాలకు జమచేయనున్నామని ఆయన తెలిపారు.

Similar News

News September 20, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన SP తుషార్

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తుషార్ డూడీ కలెక్టర్ సుమిత్ కుమార్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల సమర్థవంతమైన అమలు వంటి కీలక అంశాలపై చర్చించుకున్నారు.

News September 20, 2025

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు MP

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు శనివారం కోరారు. చిన్నపిల్లలను వాగులు, వంకల వద్దకు వెళ్లనివ్వరాదని సూచించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

News September 20, 2025

కుప్పం: భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

image

కుప్పం (M) బైరప్ప కొట్టాలుకు చెందిన కీర్తిపై కత్తితో దాడి చేసిన భర్త రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు DSP పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం తల్లి అనుమతి లేకుండా మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్న రాజేశ్ డెలివరీ కోసం భార్యను పుట్టింటికి పంపించాడు. డెలివరీ అయి 4 నెలలు కావస్తుండగా కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేయగా ఆమె రాకపోవడంతో ఈ నెల 17న కత్తితో దాడి చేశాడు.