News September 20, 2025

అక్షర్‌కు గాయం.. రేపటి మ్యాచులో ఆడతాడా?

image

ఒమన్‌తో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రేపు పాక్‌తో జరిగే మ్యాచులో ఆడటంపై అనుమానాలున్నాయి. నిన్న బౌండరీ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా అక్షర్ తలకు గాయమైంది. వెంటనే ఆయన మైదానాన్ని వీడారు. దీంతో ఆయన రేపటి మ్యాచులో పాల్గొంటారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అక్షర్ దూరమైతే భారత్ ఇద్దరు స్పిన్నర్లతోనే (కుల్దీప్, వరుణ్) ఆడాల్సి వస్తుంది.

Similar News

News September 20, 2025

రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

image

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్‌ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.

News September 20, 2025

భారత్‌-పాక్ మ్యాచ్‌కు రిఫరీగా మళ్లీ ఆయనే!

image

ASIA CUP: సూపర్-4లో రేపు భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు <<17756416>>ఆండీ పైక్రాఫ్ట్<<>> రిఫరీగా వ్యవహరించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు ఆడిన తొలి మ్యాచ్‌లో ఆయనే రిఫరీగా ఉండగా హ్యాండ్ షేక్ వివాదం తలెత్తింది. ఆండీని తొలగిస్తేనే టోర్నీలో కొనసాగుతామని ICCకి PCB ఫిర్యాదు చేసి భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనే రిఫరీగా వస్తే పాక్‌కు మానసికంగా పెద్ద దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News September 20, 2025

వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్

image

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్‌తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.