News September 20, 2025
మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.
Similar News
News September 20, 2025
ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

యూరప్‌లోని పలు ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
News September 20, 2025
రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.
News September 20, 2025
భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరీగా మళ్లీ ఆయనే!

ASIA CUP: సూపర్-4లో రేపు భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు <<17756416>>ఆండీ పైక్రాఫ్ట్<<>> రిఫరీగా వ్యవహరించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఇరు దేశాలు ఆడిన తొలి మ్యాచ్‌లో ఆయనే రిఫరీగా ఉండగా హ్యాండ్ షేక్ వివాదం తలెత్తింది. ఆండీని తొలగిస్తేనే టోర్నీలో కొనసాగుతామని ICCకి PCB ఫిర్యాదు చేసి భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనే రిఫరీగా వస్తే పాక్‌కు మానసికంగా పెద్ద దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.