News September 20, 2025

రాష్ట్రంలోనే నల్గొండ టాప్

image

ఒక్కప్పుడు ఫ్లోరైడ్‌తో గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిన నేల నేడు వరిని పండించడంలో రికార్డు సృష్టిస్తోంది. ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.38 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో నల్గొండ ఫస్ట్ ప్లేస్, 4.66లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. గతేడాది కూడా నల్గొండ జిల్లానే టాప్ లో నిలవడం గమనార్హం. కాగా 4.36 లక్షల ఎకరాలతో నిజామాబాద్ మూడో స్థానంతో ఉంది.

Similar News

News September 20, 2025

రామగుండం అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమీక్ష

image

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌తో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు, విద్య, వైద్యం, రహదారులు, తాగునీటి సరఫరాపై చర్చించారు. మున్సిపల్ పరిధిలోని రహదారులు, పార్కులు, వీధిదీపాల పనులు వేగవంతం చేయాలని కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News September 20, 2025

సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: DEO

image

సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DEO KVN.కుమార్ శనివారం తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు, అన్ని యాజమాన్య పాఠశాలలకు దసరా సెలవులను 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు (11 రోజులు) ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సెలవులను ప్రకటించాలన్నారు.

News September 20, 2025

ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

image

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్‌లతో పోల్చితే 17 మోడల్స్‌లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్‌కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.