News September 20, 2025
కృష్ణా జలాలపై కొత్త పంచాయితీ!

కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 అడుగులకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల TGకి నష్టం జరుగుతుందని, CM రేవంత్ ఎందుకు నోరు విప్పడం లేదని KTR ప్రశ్నించారు. అటు AP అసెంబ్లీలో MLA సోమిరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 130 TMCల కృష్ణా జలాలను మళ్లించేందుకు KA 1.33L ఎకరాల భూసేకరణ చేసి, ₹70,000Cr ఖర్చు చేయాలనుకుంటోందని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్‌లతో పోల్చితే 17 మోడల్స్‌లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్‌కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.
News September 20, 2025
ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

యూరప్‌లోని పలు ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
News September 20, 2025
రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.