News September 20, 2025
రాయచోటిలో గత 30 ఏళ్లలో ఈ వర్షాలు చూడలేదు: మంత్రి

రాయచోటిలో శుక్రవారం వర్షానికి <<17770012>>మృతుల కుటుంబాలను మంత్రి మండిపల్లి<<>> రాంప్రసాద్ రెడ్డి శనివారం పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. అయితే గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షాన్ని చూడలేదన్నారు. కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం కలచివేసిందన్నారు. వీటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయనతో పాటు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ దీరజ్ ఉన్నారు.
Similar News
News September 20, 2025
కల్వకుర్తిలో న్యూడ్ కాల్స్‌తో మోసం

కల్వకుర్తి పట్టణంలో సెక్స్ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. పట్టణంలోని బలరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మరో మహిళతో కలిసి సెక్స్ రాకెట్ నడిపి అందిన కాడికి దండుకుంది. కర్నూల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి న్యూడ్ కాల్స్ చేసి అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అనేకమందికి ఇదే మాదిరిగా న్యూడ్ కాల్స్ చేసి దాదాపు మూడు కోట్ల 80 లక్షల వసూలు చేసినట్లు సమాచారం.
News September 20, 2025
‘అనకాపల్లి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాల నీటిమట్టం’

జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల నీటిమట్టం పెరిగినట్లు గ్రౌండ్ వాటర్ విభాగం జిల్లా అధికారిణి శోభారాణి శనివారం కోటవురట్లలో తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా నీటిమట్టం పెరిగిందన్నారు. గత ఏడాది ఆగస్టు నాటికి భూగర్భ జలాల నీటిమట్టం 5.26 మీటర్లు లోతుకు ఉండగా ఈ ఏడాది అదే నెలలో 4.35 మీటర్ల ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ జలాల పెంపుకు చెక్ డామ్స్, నీటికుంటల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
News September 20, 2025
HYD: నకిలీ ట్రేడింగ్ యాప్.. రూ.86.65 లక్షలు కొట్టేశాడు..!

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేడింగ్ మోసం కేసులో పంజాబ్ యువకుడు గుర్జీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. 64 ఏళ్ల ఫ్రీలాన్సర్‌ను నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.86.65 లక్షలతో మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్, డెబిట్ కార్డ్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.