News September 20, 2025

TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

image

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.

Similar News

News February 8, 2026

బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

image

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News February 8, 2026

ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

image

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.

News February 8, 2026

వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

image

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్‌ ప్రిఫర్ చేస్తున్నారట.