News September 20, 2025

HYD: మీరు స్పాన్సర్ చేస్తే.. వారికి FREE టూర్

image

ఆర్టీసీ యాత్రాదానం పథకంలో 500 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ రాజధాని బస్సుల్లో రూ.26,707 నుంచి రూ.50,963 వరకు స్పాన్సర్‌షిప్ ఉంటుందని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, NRI, NGO, విద్యాసంస్థలు, సంఘాలు, కుటుంబాలు వృద్ధులు, అనాధల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు.

Similar News

News September 20, 2025

కల్వకుర్తిలో న్యూడ్ కాల్స్‌తో మోసం

image

కల్వకుర్తి పట్టణంలో సెక్స్ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. పట్టణంలోని బలరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మరో మహిళతో కలిసి సెక్స్ రాకెట్ నడిపి అందిన కాడికి దండుకుంది. కర్నూల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి న్యూడ్ కాల్స్ చేసి అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అనేకమందికి ఇదే మాదిరిగా న్యూడ్ కాల్స్ చేసి దాదాపు మూడు కోట్ల 80 లక్షల వసూలు చేసినట్లు సమాచారం.

News September 20, 2025

‘అనకాపల్లి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాల నీటిమట్టం’

image

జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల నీటిమట్టం పెరిగినట్లు గ్రౌండ్ వాటర్ విభాగం జిల్లా అధికారిణి శోభారాణి శనివారం కోటవురట్లలో తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా నీటిమట్టం పెరిగిందన్నారు. గత ఏడాది ఆగస్టు నాటికి భూగర్భ జలాల నీటిమట్టం 5.26 మీటర్లు లోతుకు ఉండగా ఈ ఏడాది అదే నెలలో 4.35 మీటర్ల ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ జలాల పెంపుకు చెక్ డామ్స్, నీటికుంటల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.

News September 20, 2025

HYD: నకిలీ ట్రేడింగ్ యాప్.. రూ.86.65 లక్షలు కొట్టేశాడు..!

image

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేడింగ్ మోసం కేసులో పంజాబ్ యువకుడు గుర్జీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. 64 ఏళ్ల ఫ్రీలాన్సర్‌ను నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.86.65 లక్షలతో మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్, డెబిట్ కార్డ్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.