News September 20, 2025
మొక్కలు నాటిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు రూరల్ నియోజకవర్గం బీవీ నగర్ ఆర్టీవో ఆఫీస్ ప్రాంతంలోని మున్సిపల్ పార్కులో స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మొక్కలు నాటారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసులు రెడ్డి, జేసీ కార్తీక్, కమిషనర్ నందన్, హార్టికల్చర్ ఆఫీసర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ బదిలీ అయ్యారు. నూతన JC గా మొగిలి వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ విజయనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు.
News September 20, 2025
నెల్లూరు: కూలితే ప్రమాదమే..!

జాతీయ రహదారి నుంచి కోవూరు మండలం ఇనమడుగు సెంటర్‌కు వెళ్లే రహదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగించకుండా ఏర్పాటు చేసిన భారీకేడ్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఓ వైపు కింది భాగం ఊడిపోయి పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో ఆ భారీకేడ్ పడిపోయి ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం వాహనాల రాకపోకల్లో భారీకేడ్ పడిపోతే పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News September 20, 2025
TDPలో చేరిన MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి

MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.