News September 20, 2025
HYD: ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

బహదూర్‌పూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వెస్టర్న్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరీష్ అగర్వాల్, ఆరుగురు ఏజెంట్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదు, 55 సెల్‌ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 60 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ‘స్కెచ్’, ’99 రేస్’ వంటి పేర్లతో నిందితులు బెట్టింగ్ యాప్‌లను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 20, 2025
సత్యసాయి: బాణాసంచా విక్రయాల లైసెన్స్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాల లైసెన్సుల కోసం సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. AE -5 దరఖాస్తు ఫారం www.peo.gov.inలో లభిస్తుందన్నారు. దీంతోపాటు నివాస ధ్రువీకరణ పత్రం, 5 ఫొటోలు, రూ.500 చలానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News September 20, 2025
మైథాలజీ క్విజ్ – 11 సమాధానాలు

1. రామాయణంలో తాటకి భర్త ‘సుందుడు’. వీళ్లిద్దరి పుత్రుడే ‘మారీచుడు’.
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ‘గంగ’. వీళ్లిద్దరూ భీష్ముడి తల్లిదండ్రులు.
3. సరస్వతీ దేవి వాహనం ‘హంస’.
4. పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశంలో ఉంది.
5. దీపావళి సందర్భంగా ‘లక్ష్మీ దేవి’ని పూజిస్తారు.
<<-se>>#mythologyquiz<<>>
News September 20, 2025
ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్‌ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <