News September 20, 2025
మాచర్లకు చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు మాచర్లకు చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన యాదవ బజార్‌లో ఉన్న చెరువు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Similar News
News September 20, 2025
9 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల కోసం కూడా వుడా పార్కులో స్టేట్ బోర్డు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అడివివరం- శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ పనులను పరిశీలించారు.
News September 20, 2025
BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా, తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.
News September 20, 2025
7,267 పోస్టులకు నోటిఫికేషన్.. అప్లికేషన్స్ స్టార్ట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, PG, B.Ed, డిప్లొమా పాసైనవారు OCT 23 వరకు అప్లై చేసుకోవచ్చు. PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్ 225, వార్డెన్ 346, Jr క్లర్క్ 228, అకౌంటెంట్ 61, స్టాఫ్ నర్స్ 550, ఫీమేల్ వార్డెన్ 289, ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులున్నాయి. వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి.