News September 20, 2025
పసుపులో నత్రజని లోపం నివారణకు సూచనలు

పసుపు పంటలో నత్రజని లోపాన్ని నివారించడానికి.. సాగు సమయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని బయటకు పంపేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ నిపుణుల సూచనలతో సమతుల సమగ్ర ఎరువులు వాడాలి. లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, 1/2 మి.లీ జిగురు మందును కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపు విత్తిన వెంటనే మల్చింగ్ చేయడం మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News September 20, 2025
ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు: సీఎం

AP: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమది అని సీఎం CBN తెలిపారు. ‘ఉల్లి రైతులకు నష్టం జరగకుండా హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలని నిర్ణయించాం. దీంతో 45వేల ఎకరాల ఉల్లి రైతులకు లబ్ధి చేకూరుతుంది. పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50వేలు చెల్లిస్తాం’ అని CM ప్రకటించారు.
News September 20, 2025
BREAKING: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మోహన్‌లాల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించారు.
News September 20, 2025
పిల్లల్లో అసూయ పెరుగుతోందా?

సాధారణంగా పిల్లలు కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ పడతారు. దాన్ని తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే కట్టడి చేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రవర్తన విపరీతంగా మారొచ్చు. ముందు దానికిగల కారణాన్ని తెలుసుకోవాలి. సానుకూలంగా ఆలోచించడం, వారి ప్రత్యేకతలపై దృష్టి పెట్టడం నేర్పాలి. స్నేహం గొప్పతనం గురించి వారికి వివరించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. అప్పుడే పిల్లలు రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతారు.